Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాదరి కిషోర్
నవతెలంగాణ - తుంగతుర్తి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించి ప్రాముఖ్యత ఇస్తుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.5 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికరమైన ఆహారం అందిస్తున్నట్టు చెప్పారు. గురుకుల పాఠశాల స్థాయిని పెంచి కళాశాలలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తాలో రూ.5 లక్షలతో నిర్మించిన డ్రయినేజీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపిక యుగంధర్‌రావు, ఎంపీపీ గుండగాని కవితరాములుగౌడ్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ చైర్మెన్ యాదగిరిగౌడ్, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య, టీఆర్ఎస్ నాయకులు రామచంద్రారెడ్డి, రాములుగౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
హరిత తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం
నవతెలంగాణ - నూతనకల్
హరిత తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్‌రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో రూ.45.28 లక్షలతో ఏర్పాటు చేయనున్న మెగా పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి మాట్లాడారు. పల్లె ప్రకృతి వనాలను పట్టణంలో ఉన్న పార్కులకు దీటుగా తయారు చేయాలని సూచించారు. అంతకుముందు మండల కేంద్రంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రొఫెసర్ జయశంకర్‌సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతిసంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, సర్పంచులు కనకటి సునీత వెంకన్న, తీగల కరుణశ్రీగిరిధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చుడి లింగారెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏర్పుల నరేష్, ఎంపీటీసీ పన్నాల రమ మల్లారెడ్డి, పీడీ కిరణ్ కుమార్, డీపీవో యాదయ్య, ఎంపీడీవో ఇందిర, ఏపీవో శ్రీరాములు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.