Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
జేఈఈ మెయిన్ ప్రధాన పరీక్ష 2021 ఫలితాల్లో నగరంలోని న్యూవిజన్ జూనియర్ కళాశాల మరోసారి జయకే తనం ఎగురవేస్తూ తమ కళాశాల విద్యార్ధి నితిన్ (282/300 మార్కులు) 99.9942523 పర్సంటైల్ సాధించా డని న్యూ విజన్ విద్యాసంస్థల చైర్మన్ సిహెచ్జికె. ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరా బాదు మినహా ఏ ఇతర జిల్లాల విద్యార్థులు సాధించని ఘన విజయం ఖమ్మం జిల్లా నుండి 99 పర్సంటైల్ ఆరుగురు విద్యార్థులు మరియు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులలో 100/100 పర్సంటైల్‌ను న్యూ విజన్ జూనియర్ కళాశాల సాధించిందని ఈ సందర్భంగా తెలిపారు.
జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జేఈఈ ప్రధాన పరీక్ష ఫలితాలలో - సాయి జశ్వంత్ 99.9457979. కె .లావణ్య -99.924333, హర్షిత 99,7569203, యశస్వి రత్న - 99.7237428, శ్రీరామ్- 99.7213303, కె.సాయి విగేష్-99.1856678, వశిష్ఠ సాయి- 98,7532327, టీ .అరవింద్ -98.586831, బి.హారిక - 98,4945246, కె.సుమంత్ - 98.4945246, ఎం.ఓం తేజస్విని - 98.1826381, కె. ఆర్యన్ 98,0635575, భువన్ వంశీ 97.8091771. ఎన్.సిరి 97.7480323, సిహెచ్. కౌశిక్ 97.6003911, కె.ప్రభాస్ 97.401655, ఆర్.సాయి సాత్విక్ రాజు 97.2243936, ఎన్. హంషుల -97.1402901, జీవీఎస్వి వరుణ్ సాకేత్ - 97.1194517- వంటి మరెన్నో ఉత్తమ పర్సంటైల్స్ సాధించారని తెలిపారు. కోవిడ్ కాలంలో సైతం విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా క్లాసులు అందించి న్యూ విజన్ ఫలితాల విషయంలో ఎప్పటిలాగే తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చి మెరుగైన ఫలితాలను సాధించిందని తెలిపారు. రాబోయే ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో జరగబోయే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ మరియు నీట్ పరీక్షల్లో కూడా తమ కళాశాల విద్యార్ధులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ
పర్సంటైల్ సాధించిన విద్యార్థులను న్యూ విజన్ విద్యాసంస్థల చైర్మన్ సిహెచ్జికె.ప్రసాద్, డైరక్టర్ సిహెచ్. గోపిచంద్ అభినందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు మరియు అధ్యాపక బృందం పాల్గొని అభినందించారు.