Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలలో ఖమ్మం శ్రీచైతన్య విద్యార్థులు 10లోపు 100లోపు ఆలిండియా ర్యాంకులను సాధించగలిగే సి-ఐపిఎల్ ప్రోగామ్‌తో జేఈఈ మెయిన్ పేపర్-1లో అత్యుత్తమ పర్సంటైల్ స్కోర్లతో విజయదుందుభి మోగించారని తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. అదేవిధంగా మాథ్స్‌లో 100 పర్సంటైల్, ఫిజిక్స్‌లో 100 పర్సంటైల్, కెమిస్ట్రీలో 99.97 పర్సంటైల్‌తో పాటుగా 90 పర్సంటైల్ పైగా 70 మంది విద్యార్థులు సాధించారన్నారు.కోవిడ్-19 వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితులలో సైతం శ్రీ చైతన్య తన విద్యార్ధులు నష్టపోకుండా వెంటనే ప్రత్యామ్నాయంగా ఆన్లైన్లో క్లాసులు నిర్వహించింది అన్నారు. లెక్చరర్లను నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉంచుతూ వారి ఫర్ఫార్మెన్ ఎప్పటికప్పుడు సమీక్షించడం వల్లనే తమ విద్యార్థులు గడ్డు పరిస్థితులలో సైతం అత్యుత్తమ పర్సంటైల్ సునాయాసంగా సాధించగలిగారని తెలిపారు.
విద్యార్థుల సామర్ధ్యాలకు అనుగుణంగా సి-ఐపీఎల్, ఐపీఎల్ ఐసి, ఎఫ్టీబి, ఎన్పీఎల్, ఐపీ వంటి బ్యాచ్‌లతో విద్యార్థులకు ప్రతీ పరీక్షలో వచ్చిన మార్కులను, వారి ప్రగతిని నిరంతరం సమీక్షించడం వల్లనే ఈ విజయాలు సాధ్యపడ్డాయని తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్షన్ శ్రీవిద్య తెలిపారు.
అత్యుత్తమ ఫలితాలను సాధించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేసిన తమ విద్యాసంస్థల విద్యార్ధులకు విద్యాసంస్థల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, అకడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక డిజియమ్ సిహెచ్. చేతన్ మాథుర్, అకడమిక్ డీన్ ఎన్.ఆర్.యస్.డి వర్మ, ఎ.జి.యం.లు సిహెచ్. బ్రహ్మం, జి.ప్రకాష్, జి.గోపాలక్రిష్ణ, ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.