Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
క్విట్ ఇడియా స్ఫూర్తితో సోమవారం నిర్వహించే సేవ్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండలంలోని వివిధ గ్రామాల్లో సిఐటియు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శనివారం విస్తృతంగా ఆటో ప్రచారం నిర్వహించారు. గ్రామగ్రామాన కరపత్రాలు పంచుతూ ఆటో ద్వారా ప్రచారం చేస్తూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించి దేశ రక్షణకు జరిగే పోరులో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రచారాన్ని నిర్వహించారు. ఈనెల 9న మండల కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలు కార్మికులు వ్యవసాయ కూలీలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ టి ఎస్ కళ్యాణ్.రైతుసంఘం మండల కార్యదర్శి కోలేటి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్ : కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రతిఘటించాలని, దేశ ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆగస్టు 9న జరిగే దేశ రక్షణ ఉద్యమంకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వైరా స్టడీ సర్కిల్ కన్వీనర్ బోడపట్ల రవీందర్ తెలిపారు. ఆదివారం వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో జరిగిన వైరా స్టడీ సర్కిల్ లో బోడపట్ల రవీందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, వైరా స్టడీ సర్కిల్ బాధ్యులు పారుపల్లి చంద్రశేఖర్ బాబు, మందడపు రామారావు, నారికొండ అమరేంద్ర్ , గుడిమెట్ల మెహన్ రావు, సామినేని నర్సింహారావు, బందెల పౌల్, వడ్లమూడి మధు, యల్లమద్ది రామకృష్ణ, ముగ్గు సందీప్ తదితరులు పాల్గొన్నారు
కామేపల్లి : సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మండలంలో వారం రోజుల నుండి గ్రామ గ్రామన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మద్దులపల్లి గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్లకి ఆదివారం వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ, పార్టీ మండల కార్యదర్శి అంబటి శ్రీనివాస్ రెడ్డి, రైతు సంఘం మండల నాయకులు గుండా వెంకటరెడ్డి, శాఖ కార్యదర్శి అడపా ఉపేందర్, శకినాల శ్రీను, రాజశేఖరం, సైదులు తదితరలు పాల్గొన్నారు.