Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్ర ముగింపు సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్
నవతెలంగాణ-గాంధీచౌక్
ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవడమే దేశాన్ని రక్షించుకోవడమని అందులో భాగంగా జరుగుతున్న సేవ్ ఇండియా ఉద్యమాన్ని, 9న జిల్లా ధర్నా చౌక్‌లో జరుగు రిలే నిరాహార దీక్షలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ పిలుపు నిచ్చారు. స్థానిక గాంధీచౌక్‌లో భూక్య శ్రీనివాసరావు అధ్యక్షతన సిపిఎం పాదయాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభలో యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ నాడు పరాయి దేశ పాలకులు (బ్రిటిష్ వారు) దోపిడీకి వ్యతిరేకంగా పుట్టిన ఉద్యమమే ''క్విట్ ఇండియా ఉద్యమం''. నేడు స్వదేశీ పాలకుల(బిజెపి) పాలకుల దోపిడీని నిరోధించడానికి నిర్వహించేదే సేవ్ ఇండియా ఉద్యమం అని పేర్కొన్నారు. క్విట్ ఇండియా స్పూర్తితో జరుగు సేవ్ ఇండియా ఉద్యమంలో అధిక సంఖ్యలో భాగస్వామ్యమై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, త్రీటౌన్ కార్యదర్శి తుశాకుల లింగయ్య, టౌన్ కమిటీ నాయకులు బండారు యాకయ్య, వజినేపల్లి శ్రీనివాసరావు, కార్పోరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, నాయకులు బజ్జూరి రమణారెడ్డి, మద్ది సత్యం, పత్తిపాక నాగసులోచన, శీలం వీరబాబు, యస్‌కె బాబు, యస్‌కె హిమామ్, యస్‌కె సైదులు, వేల్పుల నాగేశ్వరరావు, పాశం సత్యనారాయణ, రంగుహను మంతాచారి, మేకల శ్రీనివాసరావు, కొట్టె అలివేలు, ఉప్పెల్లి ఉపేంద్ర, జిబి చౌదరి, మేడేబోయిన లింగయ్య, గబ్బేటి పుల్లయ్య, చీకటి మళ్ళ శ్రీనివాసరావు, యడ్లపల్లి లక్ష్మయ్య, పి.రామకృష్ణ, మట్టిపల్లి వెంకన్న, శ్రీశైలం, కృష్ణ, నాయిని నరసింహరావు, సారంగి పాపారావు, మద్ది శ్రీను తదితరులు పాల్గొన్నారు.