Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం
దేశ ప్రజల ఆస్తులుగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను, పరిశ్రమలను ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. ఆదివారం స్థానిక మంచికంటి భవన్లో ఎల్.వి. రావు అధ్యక్షతన జిల్లా కేంద్ర శాఖల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజల సంపదగా ఉన్న సహజ వనరులను, ప్రభుత్వరంగ పరిశ్రమలను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ సంస్థలకు అప్పజెబుతోందని తెలిపారు. మరోవైపు దేశానికి అన్నం పెడుతూ, ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలబడుతున్న రైతాంగాన్ని దెబ్బతీసే విధంగా వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చారని,. ఈ వ్యవసాయ చట్టాలను అమలు ఈ తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని చేస్తే రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, మోడీ ప్రభుత్వం లేబర్ చట్టాలను హక్కులను ప్రభుత్వం హరిస్తోందని తెలిపారు. ఎన్నో పోరాటాల సవరించి కార్మికుల ఫలితంగా కార్మికులకు లభించిన వెసులుబాట్లను ప్రభుత్వాలు తిరిగి లాక్కొంటున్నాయని తెలిపారు. ధరలు పెరుగుతున్నా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందని, ప్రజాస్వామిక హక్కులను సైతం మోడీ ప్రభుత్వం హరిస్తోందని, ప్రశ్నించే కవులను, కళాకారులను, క్రీడాకారులను, సినీరంగ ప్రముఖులను, మేధావులను తీవ్ర నిర్భంధాలకు గురి చేస్తోందని అన్నారు. నియంత పోకడలను ప్రదర్శిస్తూ, రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఈ చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను సవాలుగా మారుతాయని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, ఎం.సుబ్బారావు, రాష్ట్ర నాయకులు బత్తుల హైమాపతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్, తుశాకుల లింగయ్య, నందిపాటి మనోహర్, ఝాన్సీ, ప్రజా సంఘాల బాధ్యులు బషీరుద్దీన్, మచ్చా రంగయ్య, కాల్షి సత్యనారాయణ, టి.ఎన్.రావు, టి.లక్ష్మినర్సయ్య, పల్లెంపాటి వీరభద్రరావు, అలవాల నాగేశ్వరరావు, ఇ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.