Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీఆర్ఎస్ మండల అద్యక్షుడు అన్నెం సత్యనారాయణమూర్తి అన్నారు. ఆదివారం లకీëనగరం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు..అభివృద్ధి సంక్షేమ పదకాల అమలులో దేశానికే ఆదర్శంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసి హేళనగా మాట్లాడిన పొదెం వీరయ్య భేషరతుగా క్షమాణ చెప్పడంతో పాటు ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని కళ్లుఉండి చూడ లేని గుడ్డివాడిలా మాట్లాడుతున్న ఎమ్మెల్యే పొదెం వీరయ్య 6 నెలలకు ఒకసారి నియోజక వర్గంలో పర్యటిస్తూ ప్రజా సంక్షేమం కోసం పరితనిస్తున్న ముఖ్యమంత్రిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. సీతమ్మ సాగర్ నష్ట పరిహార పక్రియ వరకు నోరు మెదపని ఆయన రాజకీయ లబ్ది కోసం మాట్లాడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన అన్నారు. మూడు సంవత్సరాలు గా ఎమ్మెల్యే పని చేస్తున్న పొదెం వీరయ్య భద్రాచలం అభివృద్దికి ఏం చేశాడో చెప్పాలన్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని ఆయన హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఎంపిపి రేసు లక్ష్మి, జెడ్పీటీసి సభ్యురాలు తెల్లం సీతమ్మ, అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా, మండల కార్యదర్శి తోట రమేష్, సీనియర్ నాయకులు కొత్తూరి సీతారామారావు, ఎంపిటిసి మడకం రామారావు, సొసైటీ డైరెక్టర్ కాలువ పూర్ణయ్య, నాయకులు కణితి రాముడు, దామెర్ల శ్రీనివాస్, జయసింహ, రంజిత్, శేఖర్, శ్రీధర్ తదితరులు ఉన్నారు.