Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
కాటిబోయిన నాగేశ్వరరావు పదవి వ్యామోహం, స్వార్ద రాజకీయాల కోసమే పార్టీకి వెన్నుపోటు పొడిచాడని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. ఆదివారం సమితిసింగారంలో జరిగిన పలు శాఖ మహాసభల్లో పాల్గొని ఆయన మాట్లాడుతూ పాలు తాగి కన్నతల్లికి రొమ్మును గుద్దాడని అన్నారు. పార్టీకి ద్రోహం చేసినవారు బుద్ది హీనులుగా మారుతారన్నారు. చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతారని అన్నారు. కాలమే సమాధానం చెబుతుందన్నారు. విచ్ఛిన్నం చేస్తే ఖబర్దార్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నయన్నారు. రాబోయే కాలంలో ప్రజా సమస్యలపై ఉధత పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనీయర్ నాయకులు నెల్లూరి. నాగేశ్వరరావు, సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల.శ్రీనివాస్, గొడిశాల రాములు, రంగ, నర్సయ్య, కమలమ్మ, నాగలక్ష్మి, ఐలమ్మ, స్వరూపరాణి, చంద్రయ్య, నాగభూషణం, నాగమణి, నాగమ్మ, పాల్గొన్నారు.