Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగణ-మణుగూరు
రాష్ట్రంలో పోడు భూముల సమస్యలపై గిరిజన రైతులను, ఫారెస్ట్ అధికారులపై తిరగబడండని రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా.కాంతారావు రెచ్చగొట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ.వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం పోడు యాత్రలో భాగంగా మణుగూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని, సమస్యలు ఉన్న జిల్లాల్లో కుర్చి వేసుకోని కూర్చుని పట్టాలు పంచుతామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర సహాయక కార్యరద్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సీతమ్మసాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.25 లక్షలు చెల్లించాలన్నారు. మణుగూరు బీటీపీఎస్ రైల్వే లైన్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. బీటీపిఎస్లో భూములు కోల్పోయిన 39 మంది భూ నిర్వాసిత నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కామ్రేడ్ మైసా.కొండయ్య, ఏఐటియూసి కార్యాలయాన్ని రాష్ట్ర కార్యదర్శి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బోల్లోజు అయోధ్య చారి, కార్యదర్శి వర్గ సభ్యులు హనుమంతరావు, బాల మల్లేష్ పాల్గొన్నారు.
నిర్వాసితులకు అండగా ఉంటాం
అశ్వాపురం : సీతమ్మ సాగర్ భూ నిర్వాసితులకు అండగా ఉంటామని రైతులు అధైర్యం చెందోద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. పోరు యాత్రలో భాగంగా ఆదివారం అమ్మగారిపల్లిలోని భూనిర్వాసితుల దీక్ష శిబిరంను సందర్శించి మద్దతు తెలిపారు. భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని కోరారు. పోరు యాత్ర కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నక్క బాలమల్లేష్, భాగం హేమంతరావు , రామావత్ అంజయ్య నాయక్, కలకొండ కాంతయ్య, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్, సీపీఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్ పాల్గొన్నారు.