Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలో సీఐటియు కార్యాలయం నందు అఖిలపక్ష కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం.బీ.నర్సారెడ్డి, ఐఎన్టియూసి జిల్లా నాయకులు కృష్ణార్జున రావులు మాట్లాడుతూ ఆగస్టు 9కి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని క్విట్ ఇండియా ఉద్యమానికి స్ఫూర్తిగా ఆరోజు నిలుస్తుందని అన్నారు. రేపు జరిగే భారత దేశ రక్షణ కోసం స్థానిక అంబేద్కర్ సెంటర్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష ను జయప్రదం చేయాలని కోరారు. ఈ దీక్షలో సీఐటి యు, ఐఎన్టియుసి, ఐఎఫ్టియు, ఏఐటీయూసీ అదేవిధంగా అఖిలపక్ష రైతు సంఘాలు, అఖిల పక్ష వ్యవసాయ కార్మిక సంఘాలు, కూడా పాల్గొంటున్నాయని అన్నారు. పట్టణంలోని ప్రముఖులు అందరు కూడా ఈ దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐయన్ టియూసీ నాయకులు సింగ్, ప్రకాష్, సిఐటియు నాయకులు సిహెచ్ మాధవరావు, యన్.నాగరాజు, పి సంతోష్ కుమార్, జి లక్ష్మణ్,అర్జున్, వీరన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.