Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హక్కుల పరిరక్షణ
- కలెక్టరేట్ ముందు ధర్నా
నవతెంలగాణ-కొత్తగూడెం
ఆదివాసీ హక్కులను అమలు చేయకుండా ప్రభుత్వాలు గిరిజనులను మోసం చేస్తున్నాయని, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆదివాసీయులు ధర్నా నిర్వహించారు. దీన్ని విజయ వంతం చేయాలని ఏఐకెఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యలు అన్నారు. ఆదివారం స్థానిక ఇఫ్య్టూ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.ఆదివాసీలను అడవి నుండి గెంటివేసే ధరోణి ప్రభుత్వాలు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు మాచర్ల సత్యం. డివిజన్ నాయకులు యన్.సంజీవ్, పట్టణ కార్యదర్శి పెద్దబోయిన సతీష్‌లు పాల్గొనారు.