Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతకాని
గ్రామంలోని ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీవో రవీంద్ర ప్రసాద్ కోరారు. సోమవారం మండల పరిధిలోని ప్రొద్దుటూరు ప్రభుత్వ పాఠశాల ముందు వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపిఓ మాట్లాడుతూ ఇప్పటివరకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రమే వ్యాక్సినేషన్ వేశామని ఇకనుంచి ప్రతి గ్రామంలో సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రజలంతా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు.