Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
ఏజన్సీ చట్టాలకు పాలకులు తూట్లు పొడుస్తూ ఏజన్సీ ప్రజలపై నిర్భాంధాలను విధిస్తుందని ఆదివాసీ గిరిజన సంఘ అధ్యక్ష కార్యదర్శులు వజ్జా రామారావు, దుగ్గి కృష్ణలు విమర్శించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా కారేపల్లి మండలం కోయగుంపు, పాటిమీదిగుంపు గ్రామాల్లో ర్యాలీలను నిర్వహించారు. ఆదివాసి గిరిజన సంఘం జెండాను ఎగరవేశారు. ఈసందర్బంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పోడు భూములు సాగుచేస్తున్న ఆదివాసీలపై పాలకులు అక్కసు వెళ్ళబోసుకుంటున్నారన్నారు. హక్కుపత్రా లున్నా సాగుకు అడ్డుపడుతూ గిరిజనులను ఆర్ధికంగా నష్టపోయేలా చేస్తున్నారన్నారు. ఏజన్సీ ప్రాంతంలో ఫిసా చట్టం అమలుకు నోచుకోవటం లేదన్నారు. గిరిజన హక్కుల రక్షణకై ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని కోరారు. ఈకార్యక్ర మంలో కారేపల్లి సోసైటీ మాజీ అధ్యక్షులు ఈసాల నాగేశ్వరరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కరపటి సీతారాములు, కల్తి రామచంద్రయ్య, పాయం వెంకటేశ్వర్లు, పాయం ఎర్రయ్య తదితరుల పాల్గొన్నారు.
కారేపల్లి, ఎరబ్రోడు ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో కారేపల్లిలో ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన పతాకాన్ని భూక్యా వీరభద్రం ఎగరవేశారు. ఎర్రబోడు సర్పంచ్ కుర్సం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివాసి దినోత్సవాన్ని నిర్వహించారు. కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. ఈకార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కల్తి రాంప్రసాద్. చీమల స్వామి, పొదెం రాంమ్మూర్తి, తాటి రామారావు, వజ్జా భాస్కర్, చింత భద్రమ్మ, సుధాకర్, నవీన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కామేపల్లి : ఊట్కూరు శివారులో గల ఊటవాగు ప్రాంతంలో నివాసముంటున్న ఆదివాసీ కాలనీలో గిరిజనసంఘం ఆధ్వర్యంలో సంగం జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ, రాష్ట్ర నాయకులు మీక్తీ సాంబశివరావు, సంఘం జిల్లా అద్యక్షులు వజ్జా రామారావు, సర్పంచ్ కొడెం సులోచన, బుచ్చి రాములు, దుగ్గి పాపారాణీ పాల్గొన్నారు.