Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సాంకేతిక శిక్షణలో కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పంటల నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. జిల్లా పంచాయతీ రాజ్ వనరుల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన వ్యవసాయశాఖ సిబ్బందికి సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2021 సంవత్సరానికి నూతనంగా పట్టా పొందిన రైతులను రైతుబీమా పథకంలో నమోదు చేయాలన్నారు. ఏఈవోలు రైతువేదికల్లో రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయనిర్మల వ్యవసాయ విస్తరణ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. వ్యవసాయ శాఖ సెక్రటరీ ఆదేశాల మేరకు పంటల బీమా, పంటల నమోదు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పంట రుణమాఫీ పథకాలపై శిక్షణ ఇచ్చారు. మాస్టర్ ట్రైనర్స్ కె.రాజు, కొణిజర్ల మండల వ్యవసాయ అధికారి బాలజీ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు శ్రీనివాసరెడ్డి, సరిత, విజయచంద్ర, కొంగర వెంకటేశ్వరరావు, వేల్పుల బాబూరావు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.