Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహశీల్దార్‌కు సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ- తిరుమలాయపాలెం
మండల కేంద్రంలో అత్యంత విలువ కలిగిన ప్రభుత్వ భూమిని అధికార పార్టీ అండతో కొందరు కాజేయాలని చూస్తున్నారని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి అంగిరేకుల నరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని, వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ కోట రవికుమార్కి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్డీ జియావుద్దీన్, కొమ్ము శ్రీను, నేరుసుల వెంకటేష్, రమేష్, వీరన్న, పప్పుల ఉపేందర్ పాల్గొన్నారు.