Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
ఆటోమొబైల్ సంస్థ హీరో నూతనంగా తయారుచేసిన హీరో గ్లామర్ ఎక్స్ టెక్ మోడల్ నూతన ద్విచక్ర వాహనాన్ని శ్రీ సాయి హరి గణేష్ మోటార్స్ హీరో షో రూమ్ లో బోనకల్ ఎస్ఐ బలుగూరి కొండల్ రావు, ట్రైనీ ఎస్ఐ మాలోతు సురేష్ సోమవారం ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీ సాయి హరి గణేష్ మోటార్స్ హీరో షోరూం యజమాని గండు శ్రీనివాస్ మాట్లాడుతూ హీరో గ్లామర్ ఎక్స్ టెక్ ద్విచక్ర వాహనాన్ని నూతన సాంకేతిక హంగులతో 125 సిసి ఇంజన్ సామర్థ్యంతో రూపొందించామన్నారు. దీనిలో స్టైల్ టెక్నాలజీ, సేఫ్టీ స్మార్ట్ ఫీచర్స్, నావిగేషన్, బ్లూటూత్ ,మొబైల్ చార్జర్, ఎల్ఈడి ల్యాంప్స్ వంటివి ప్రత్యేకతలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ వాహనానికి సైడ్ స్టాండ్ తీయకపోతే ముందుకు వెళ్లదని ఆయన తెలిపారు. శ్రీ సాయి హరి గణేష్ మోటార్స్ హీరో షో రూమ్ లో ప్రతిరోజు ఈ వాహనం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ దొండపాటి వెంకటనారాయణ, చిరునోముల మాజీ ఎంపీటీసీ నిమ్మ తోట ఖానా, చిరునోముల మాజీ సర్పంచ్ నీలకంఠం రాము, షో రూమ్ సిబ్బంది షేక్ ఇమ్రాన్, బిక్క సాని అపర్ణ, పఠాన్ అబ్బా పాషా, దారెల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.