Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ-బోనకల్
రాష్ట్రంలో కోవిడ్ ఉదృతి తగ్గి అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నందున వెంటనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని టీఎస్ యుటిఎఫ్ మండల కార్యదర్శి గూగులోతు రామకృష్ణ కోరారు. మండల కేంద్రంలో లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పిల్లలపై కోవిడ్ ప్రభావం అంతగా ఉండదని, పాఠశాలలు ప్రారంభించుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేశారన్నారు. పార్లమెంటరీ కమిటీ సైతం పాఠశాలలు ప్రారంభించాలని సూచించిందన్నారు. మెజారిటీ తల్లిదండ్రులు పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలనే కోరుతున్నారన్నారు. ప్రత్యక్ష విద్యాబోధన లేకపోవటం వల్ల విద్యార్థులు మరో విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తోందన్నారు. పాఠశాలల ప్రారంభానికి అనుమతి లేకున్నా సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పూర్వ విద్యార్థుల చేత గ్రామీణ అభ్యసనా కేంద్రాలను (విలేజ్ లెర్నింగ్ సర్కిల్స్) నిర్వహిస్తుందన్నారు. వారానికి ఒక కేంద్రం చొప్పున ఉపాధ్యాయులు 8 నుండి 100 కిలోమీటర్లు వెళ్ళి విఎల్సిలను సందర్శించి వస్తున్నారన్నారు. అక్కడ లేని కరోనా పాఠశాలల్లోనే ఎలా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. విలేకర్ల సమావేశంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు కంభం రమేష్, నాయకులు ఎంసిఆర్ చంద్ర ప్రసాద్, పి సుశీల, ఆలస్యం పుల్లారావు, పి నరసింహారావు, కే అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.