Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు ఆళ్ళపల్లి మండల కేంద్రము ఎస్సీ కాలనీలో యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరథ పనులు ప్రారంభమయ్యాయని స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి అన్నారు. ఈ మేరకు సోమవారం ఎస్సీ కాలనీలో ప్రారంభమైన మిషన్ భగీరథ పనులు ఎంపీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా మండలంలో ప్రారంభానికి నోచుకోని పలు అభివృద్ధి పనుల పరిష్కారానికి ఈ నెల 5న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్వయంగా కలవడం జరిగిందన్నారు. దీంతో వెంటనే స్పందించి ఎమ్మెల్యే మండలంలో పలు పనులపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సత్వరమే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. అందులో భాగంగానే నేడు మిషన్ భగీరథ పనులు ప్రారంభమైనట్లు ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి డీయల్ పీవో హరిప్రసాద్, ఆళ్ళపల్లి ఎంపీవో శివ, స్థానిక సెక్రటరీ ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు, టీఆర్ఎస్ మండల కార్యదర్శి, మాజీ ఉపసర్పంచ్ ఎండీ.ఖయ్యుం, లక్షయ్య, తదితరులు పాల్గొన్నారు.