Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్మిక కర్షక మైత్రితో దేశాన్ని రక్షిద్దామని, కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాన్ని తిప్పి కొడదామని, ప్రజా సంఘాల సత్యగ్రహ దీక్షలో వక్తల పిలుపు నిచ్చారు. సోమవారం దేశవ్యాప్త పిలుపులో భాగంగా క్విట్ ఇండియా స్పూర్తితో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక, వ్యవసాయ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన దీక్షా శిబిరంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా, కాంగ్రెస్ నాయకులు నాగ సీతరాములు, సిఐటియు రాష్ట్ర నాయకులు మందా నరిసింహారావు, ఐఎఫ్టీయు నాయకులు కె.సీతారామయ్య, ఐఎన్టీయుసి నాయకులు త్యాగరాజు సంఘీభావ మద్దతు తెలియచేసారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆనాడు తెల్లదొ రలకు వ్యతిరేకంగా దేశాన్ని రక్షించటం కోసం క్విట్ ఇండి యా పేరుతో పెద్ద ఉద్యమం కొనసాగిందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కుల్ని కాలరాస్తు, కార్మిక చట్టాల్ని రద్దు చేసేవరకు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయాకులు మచ్చా వెంక టేశ్వర్లు, ఎజె.రమేష్, కున్సోత్ ధర్మ, గుత్తుల సత్యనారాయణ, వై శ్రీనివాసరెడ్డి, ముత్యాల విశ్వనాదం, రాంటెంకి ఆశోక్, ఎన్ సంజీవ్, కాలం నాగబూషణంలు అధ్యక్ష వర్గంగా వ్యవ హారించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తిరుపతిరావు, ఎల్ బాలరాజు, బి. వీరభద్రం, ఎస్ లక్ష్మి, డి.రవికుమార్, భూక్యా రమేష్, వీర్మ రమేష్, నాగేశ్వరరావు, రింగు వెంకటయ్య, మొగిలి, అంబాల దుర్గమ్మ, కె సత్య, పూర్ణ, సలిగంటి శ్రీనివాసరావు, కొచ్చర్ల జోసెఫ్, పిట్టల రాం చందర్, మూరపాక రమేష్, ఎల్.మారుతిరావు, యండి ఆలీముద్దిన్. మల్లిఖార్జున రావు, తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య ఆధ్వర్యంలో నిరసనలో భాగంగా కార్పొరేట్లో క్విట్ ఇండియా స్ఫూర్తితో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి మాట్లాడ ారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు ఎం.చంద్రశేఖర్, సిఐటియు నాయకులు సిహెచ్. శ్రీనివాస్, కె.నరసింహా రావు పాల్గొన్నారు.
అదేవిధంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటియూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు ఆధ్వర్యంలో నిరసనలో భాగంగా జికేఓసి, పివికే-5, కార్పొరేట్ సెంట్రల్ వర్క్ షాప్‌లో క్విట్ ఇండియా స్ఫూర్తితో డిమాండ్ల ప్లకార్డ్‌లు పట్టుకుని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ బ్రాంచి అధ్యక్ష, కార్యదర్శులు గాజుల రాజారావు, విజయగిరి శ్రీనివా స్, వై.వెంకటేశ్వరరావు, కర్ల వీరస్వామి, శ్రీరాంమూర్తి, కె.రమేష్ బాబు పాల్గొన్నారు.