Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలను...పసిపిల్లలను జైలుకు పంపుతున్న దుర్మార్గ ప్రభుత్వాలు
- హరిత హారం పేరుతో ఆదివాసీయుపై ఉక్కుపాదం
- పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి. సంధ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
పాలక ప్రభుత్వాలు అడవిలో చేస్తున్న ఖనిజ దోపిడీకి వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమించాలని, పోడు భూమి సాగుదారులైన మహిళలు, పసి పిల్లలను చూడకుండా జైలుకు పంపుతున్న దుర్మార్గ ప్రభుత్వాలకు కాలం చెల్లిందని, హరితహారం పేరుతో ఆదివాసీయుపై ఉక్కుపాదం మోపే కుట్రను తిప్పికొడతామని పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి. సంధ్య అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఇఫ్ట్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్పోరేట్ కంపెనీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దళారులగా వాడుకుంటునాయని ఆరోపించారు. 5వ, 6వ షెడ్యూల్ ఏరియాలోని ప్రకృతి సంపదను ఖనిజాలను దోచుకుందన్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీలు ఉద్యమించాలన్నారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చట్టాలను మార్చి ఆదివాసీలకు ద్రోహం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. 1/70, పీసా చట్టం, సుప్రీం కోర్టు, సమతా తీర్పులు, 2006 చట్టం, ఆదివాసీలకు కల్పించిన హక్కులను కేంద్రం తుంగలో తొక్కుతుం దని ఘాటుగా విమర్శించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ పోలీసులు, అటవీ అధికారులు ధారుణంగా మహిళలను కొట్టడం, పసిపిల్లలతో సహా జైళ్లకు పంపించిన తీరు పట్ల తీవ్రంగా ధ్వజమెత్తారు.
80 ఏండ్ల వృద్ధ్దుడు స్టాన్స్వామిని ఆనారోగ్యంతో బాధపడుతూ జైలులోనే మృతిచెందిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయన మృతికి నివాళి, సంతాపం తెలిపారు. నియంతృత్వ, ఆమానవీయతను కలిగి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ఫారెస్టు పేరుతో ఆదివాసీలపై చేస్తున్న దుర్మార్గపు చర్యలను ఎప్పటి కప్పుడు అడు ్డకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 9 ఆంతర్జా తీయ ఆదివాసీ పోరాట దినం సందర్భంగా' ఆకుపచ్చపేరుతో ఆదివాసీల సాగు పోడు భూ ములు లాక్కోవడం దుర్మార్గం' పుస్తకాన్ని అవిష్క రించారు. ఈ విలేకర్ల సమావేశంలో ఇఫ్ట్యూ జిల్లా నాయకులు ఎల్. విశ్వనాధం, పిఓ డబ్ల్యూ జిల్లా నాయకురాలు నిర్మల, రామూర్తి, లక్ష్మీ పాల్గొన్నారు.