Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్య, ఉపాధి కల్పన కోసం ఆగస్టు 9 నుండి 20 వరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు లిక్కి బాలరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు వీరభద్రం స్పష్టం చేశారు. సోమవారం మంచి కంటి భవన్లో ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ యువజన విద్యార్థి సంఘాల జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, ఉపాధి కల్పనలో ఘోర వైఫల్యం చెందాయని విమర్శించారు. విద్యా, ఉపాధి కల్పనకై యువజన, విద్యార్థి సంఘాల నేతత్వంలో ఆగస్టు 9 నుండి 20 వరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిజి, పిహెచ్‌డిలు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉపాధి దొరకక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు రబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు నవీన్ కొట్టే తదితరులు పాల్గొన్నారు.