Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోట్లు కాజేస్తు సంస్థను దివాలా తీయిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం
- విలేకర్ల సమావేశంలో కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాయల మాత్రికుడని, తన మాయమాటలతో కార్మికులను, ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడని సింగరే ణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసి) గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివవరావు ఘాటుగా విమర్శించారు. సోమవారం ఏఐటీయుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారత దేశంలో అతిపెద్ద పరిశ్రమ, తెలంగాణ రాష్ట్రానికి వెన్నుముకగా ఉన్న సింగరేణి సంస్థ మనుగడను, కార్మికుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. పన్నుల రూపంలో, సిఎస్ఆర్ నిధుల పేరుతో కార్మికులు కష్ట పడి సాధించిన కోట్లాది రూపాయలు దిగమింగుతూ సింగరేణి సంస్థను దివాలా తీయిస్తున్నారన్నారని ఆరోపించారు. సింగరేణి పరిరక్షణకు 10, 11 తేదీల్లో సింగరేణి వ్యాపితంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట, కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట జరిగే 48 గంటల నిరవధిక దీక్షను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ విలేకర్ల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా, ఏఐటియూసీ జిల్లా నాయకులు గుత్తుల సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్, యూనియన్ కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి జి.వీరస్వామి, నాయకులు సందెబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.