Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహరావు
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి సంస్థను రక్షించుకునేందుకు, మంచి వేతన ఒప్పందం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిఎస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం మణుగూరు ఓసి2లో జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ...వేతన ఒప్పందంపై ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ మేరకు డీపీఈ గైడ్‌లైన్‌లో వున్న ఆటంకాలను మొదటి సమావేశంలో కోలిండియా మేనేజ్మెంట్లో అనేక అంశాలు పెట్టిందన్నారు.
తదితర డిమాండ్లను సాధించుకోనేందుకు సింగరేణిలో అన్ని ఏరియాల్లో సమయాత్వం కావాల్సిన అసవరం వుందని ఆయన పేర్కొన్నారు. అలాగే బీజేపీ ప్రభుత్వం ప్రయివేటీకరణ పేరుతో వాటాల అమ్మకం, కమర్షియల్ మైనింగ్ కాకుండా కోల్డ్బెల్ట్ ఏరియా ప్రాజెక్ట్ పనులు 57ను సవరించి గతంలో వున్న తదితర సంస్థలకు ఇవాల్సిన బ్లాక్‌లను ప్రయివేటు వాళ్లకు కూడా లీజుకు ఇవ్వడంతో పాటు ప్రయివేటు వాళ్లు ఎవరికైన అమ్ముకునే వీలు కల్పిస్తు చట్టాన్ని మార్చడం బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేఖ విధానాలను తిప్పికోట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అధ్యక్ష, కార్యదర్శులు టివిఎంవి.ప్రసాద్, వల్లూరి వెంకటరత్నం, బ్రాంచ్ నాయకులు ఎన్.ఈశ్వర్రావు, విల్సన్, బొల్లం రాజు, రాములు, రామ్మూర్తి, బుచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.