Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల పాదయాత్రలో ఎన్డీ రాష్ట్ర కమిటీ సభ్యులు మధు
- పాదయాత్రకు సీపీఐ(ఎం), సీపీఐ సంఘీభావం
నవతెలంగాణ-ఇల్లందు
ఏజెన్సీలో గిరిజనులకు జీవనాధారం సాగుభూమి లేనని న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆవునూరి మధు అన్నారు. పోడు భూముల ఆక్రమణలు నిలిపివేస్తూ పట్టాలివ్వాలని, వ్యవసాయ వ్యతిరేకం నల్ల చట్టాలను రద్దు చేయాలని, ఓపెన్‌కాస్ట్ రద్దు చేస్తూ భూగర్భ గనులు తీయాలని తదితర అనేక డిమాండ్లతో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. కొమరారం నుండి కొత్తగూడెం కలెక్టరేట్ వరకు పోడు రైతులు కాలి నడకన పాదయాత్ర చేపట్టారు. కొమరారం గ్రామపంచాయతీలో సోమవారం ప్రారంభమైన పాదయాత్ర మంగళవారం ఇల్లందుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం), సీపీిఐ పార్టీల నేతలు అబ్దుల్ నబీ, తాలూరి కృష్ణ, బంధం నాగయ్య, ఏపూరి బ్రహ్మంలు సంఘీభావం తెలిపారు. అనంతరం కొత్త బస్టాండ్ సెంటర్లో జరిగిన సభలో వారు మాట్లాడారు. పాదయాత్రలో పోడు రైతులు, న్యూడెమోక్రసీ రాష్ట్ర, జిల్లా, మండల గ్రామ స్థాయి నేతలు, సర్పంచులు పాల్గొన్నారు.