Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బందు పథకానికి విధివిధానాలు రూపొందించాలని, ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వర్తింప చేయాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు యం.బి.నరసారెడ్డిలు డిమాండ్ చేశారు. పార్టీ కుర్రాజుల గుట్ట శాఖ ఏడవ మహాసభ తాళ్ల రాజు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై కృషి చేయడం ద్వారా పార్టీ అభివృద్ధికి దోహదపడాలి అని పిలుపునిచ్చారు. మహా సభకు ముందు సీనియర్ సభ్యులు, మాజీ వార్డు నెంబర్ మడెం లక్ష్మి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మహాసభలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు కుంజా శ్రీనివాస్, లక్ష్మి, ముత్యాలు, రాములమ్మ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
శాఖ కార్యదర్శిగా కాపుల లక్ష్మి
కుర్రాజుల శాఖ కార్యదర్శిగా కాపుల లక్ష్మిని మంగళవారం జరిగిన మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.