Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
కేంద్ర ప్రభుత్వం 2021 విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే తీవ్రంగా ప్రతిఘట స్తామని కార్మిక సంఘాలు ఇంజినీర్స్ అసోసియేషన్ జేఏసీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 5, 6, 7 ప్రధాన గేటు వద్ద విద్యుత్ సవరణ బిల్లు 2021 ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవనాడిగా ఉన్న విద్యుత్ రంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశానికి కార్పొరేట్లకు అప్పగించేస్తుందని అన్నారు. ఈ బిల్లును దేశంలోనే కార్మికవర్గం తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు, ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ మంగీలాల్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బ్రహ్మాజీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ హెచ్ 142 యూనియన్ రాష్ట్ర నాయకులు కె.వి. రామారావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకిరెడ్డి నరసింహారావు, 1535 యూనియన్ సెంట్రల్ కమిటీ సెక్రెటరీ రాధాకృష్ణ, 11 నోట్4 యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధీర్, గిరిధర్, మధు బాబు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం కేంద్ర బీజేపీ ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ చట్టం సవరణ బిల్లు 2020-21ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ ఎలక్ట్రసిటి ఎంప్లాయిస్ (ఎన్సీఓఇఇఇ) దేశ వ్యాప్త పిలుపులో భాంగా మంగళవారం భద్రాద్రి కొత్తగూ డెం సర్కిల్ ఆఫీస్ నందు విధ్యుత్ ఉధ్యోగులు కార్మికులు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు యూనిన్ల నాయకులు మాట్లాడుతూ దేశానికి జీవనాడి విద్యుత్ రంగమని అన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిం చేందుకు బిజేపి ప్రభుత్వం తెచ్చిన విద్యత్ చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నుండి పులి గణేష్, కూను రాజు శ్రీనివాసు, గొల్లపల్లి వెంకన్న, 1104ను నుండి హేమంబరాధర్ రావు, అశోక్, 327 నుండి రాజేష్, శివరంజని, పలువురు నాయకులు పాల్గొన్నారు.