Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
పేద ప్రజల సంపదను కొల్లగొట్టి పెట్టుబడి దారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెడుతు న్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. మండల పరిధిలోని చిరునోముల సీపీఐ(ఎం) గ్రామ శాఖ మహాసభ మంగళవారం మాజీ ఎంపీటీసీ నిమ్మ తోట ఖానా అధ్యక్షతన జరిగింది. తొలుత మహాసభ ప్రారంభ సూచకంగా పార్టీ సీనియర్ నాయకులు వేమ రామయ్య సీపీఐ(ఎం) పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కరోనా విలయతాం డవం చేస్తున్న సమయంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 1.60 కోట్లు విలువ చేసే సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఖమ్మం కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో ఐసోలేషన్ కేంద్రంలో 203 మందిని పూర్తి ఆరోగ్యవంతంగా చేసి ఇళ్లకు పంపించామన్నారు. గ్రామీణ స్థాయిలోనే ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) శ్రేణులకు పిలుపునిచ్చారు. క్షేత్రసా ్థయిలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించి దానికి అనుగుణంగా పోరాటాలు నిర్వహించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చాడని, దళితులపై ప్రేమతో కాదన్నారు. అనంతరం నూతన శాఖ కార్యదర్శిగా నిమ్మల రామారావును ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ మహాసభలో మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, మాజీ ఎంపీపీ కొమ్ము శ్రీనివాసరావు, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కిలారి సురేష్, బోనకల్లు సొసైటీ ఉపాధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు, చొప్పకట్ల పాలెం సిపిఎం గ్రామ కమిటీ కార్యదర్శి పల్లా కొండల రావు, చిరునోముల శాఖ కార్యదర్శి పంతంగి శ్రీనివాసరావు, నాయకులు సత్యాల వెంకట్రామయ్య అల్లిక రంగయ్య ముంగి వెంకన్న, గోల్ల కోటేశ్వరరావు, పి.దుర్గారావు పాల్గొన్నారు.
ప్రజా ఉద్యమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) అగ్రస్థానం
ఖమ్మం : జిల్లాలో అనేక ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూనే ఏకకాలంలో మరోసారి సేవా కార్యక్రమాల్లో కూడా సీపీఐ(ఎం) ముందు ఉందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం 59 డివిజన్ శాఖ మహాసభలు రాపర్త బ్రిడ్జి వద్ద ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పి.గంగాధర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం హామీలు ఇవ్వడమే పనిగా పెట్టుకుందని, ఆచరణలో మాత్రం విఫలం అయ్యారని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచితంగా మెడికల్ క్యాంపు, కరోనా సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం కేవలం సీపీఐ(ఎం)కే సాధ్యం అయిందన్నారు. కార్యక్రమంలో పార్టీ టూ టౌన్ సెక్రటరీ వై.విక్రమ్, నాయకులు నర్రా రమేష్, బి.సుదర్శన్, జె.వెంకన్న బాబు, బి.ఉపేంద్ర, శెట్టి రవీంద్ర, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య బంధు పథకం పెట్టాలి
ఖమ్మం : బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెడికల్ క్యాంపు విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఆరోగ్య బంధు పథకం తేవాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆసుపత్రుల్లో ఫీజులు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యం, విద్యా రంగానికి ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయడం లేదని విమర్శించారు. అనంతరం పేషెంట్ లకు షుగర్, బిపి చెక్ చేసి నెలకు సరిపడా మందులు డాక్టర్లు ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్లు భారవి, కొల్లి అనుదీప్, జెట్ల రంగారావు, సీహెచ్ సుబ్బారావులు రోగులను పరిక్షించారు. తిరిగి వచ్చే నెల మెదటి శనివారం మెడికల్ క్యాంపు వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) టూ టౌన్ సెక్రటరీ వై.విక్రమ్, వై.శ్రీనివాసరావు, పి.ఝాన్సీ, రామారావు, వాసిరెడ్డి వీరభద్రం, నర్రా రమేష్, బి.సుదర్శన్, జె.వెంకన్నబాబు, కె.వెంకన్న పాల్గొన్నారు.