Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
చెరువుల శిఖం భూములకు రెక్కలొస్తున్నారు. అర్థ, అంగబలంతో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎంచక్కా చెరువు శిఖం భూములను ఆక్రమిస్తూ దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. మండల పరిధిలోని పెద్దగోపతి గ్రామ రెవెన్యూ పరిధిలో గల దామర్లకుంట శిఖం భూమిని ఖమ్మంనకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించాడు.
పెద్దగోపతి గ్రామ రెవెన్యూ పరిధిలో 402, 403, 404 సర్వే నెంబర్లలో 21 ఎకరం 26 గుంటలు విస్తీర్ణంలో దామర్లకుంట చెరువు ఉంది. ఈ చెరువు కింద సూమారు 180 ఎకరాలు భూమి ఆయకట్టు ఉంది. అందరూ సన్నకారు, మధ్య తరగతి రైతులే. రియల్ ఎస్టేట్ వ్యాపారి దామర్లకుంట పక్కనే 10 ఎకరాల 23 గుంటల భూమిని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి దాంట్లో ఆర్అండ్బీ రోడ్డ స్థలంతో పాటు పక్కనున్న చెరువు శిఖం భూమిని కలుకుని హద్దులు ఏర్పాటు చేసుకున్నాడు. 402 సర్వే నెంబర్లో గల ఒక ఎకరం పది గుంటల చెరువు శిఖం భూమిని 2012, 2013 సంవత్సరంలో అప్పటి అధికారులతో కుమ్మక్కై ఆర్వోఆర్ పట్టా దారు పాసుపుస్తకం పొందినట్లు సమాచారం. సదరు భూమిలో వెంచర్ వేసేందుకు ఇటీవల మట్టిని తోలించాడు. అదేవిధంగా ఆ భూమిని నలభై లక్షల రూపాయలకు అమ్మినట్లు స్థానికులు చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి : ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కో కన్వీనర్, స్వర్ణ సుబ్బారావు
పెద్దగోపతి గ్రామంలోని దామర్లకుంట చెరువు శిఖం భూమిని ఆక్రమించుకున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారి దిరిశాల చిన్న వెంకటేశ్వర్లుపై అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోని ఆక్రమణకు గురైన చెరువు శిఖాన్ని స్వాధీనం చేసుకోవాలి. భూముల ధర విపరీతంగా పెరగటంతో రియల్ మాఫియా కండ్లు శిఖం, ప్రభుత్వ భూములపై పడ్డాయని వాటిని కబ్జాకు గురికాకుండా కాపాడాల్సిన అధికారులు తమకే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ శిఖం భూమి కబ్జాకు గురైన విషయాన్ని ఆర్ఆండ్బి, ఐబీ, తహశీల్దార్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లానని ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు విస్తీర్ణనాన్ని సర్వే చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తా.