Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుబ్బాక ఎంఎల్ఎ రఘునందనావు
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని ప్రజాస్వామ్యానికి అనుకూలంగా సాగాల్సిన పాలనను తమ చెప్పుచేతల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దొరల పరిపాలన కొనసాగిస్తున్నారని దుబ్బాక శాసన సభ్యులు, బిజెపి సీనియర్ నాయకులు ఎం.రఘునందన్ రావు తెలిపారు. మంగళవారం ఖమ్మం ఆర్అండ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న పోలీస్ తీయపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ని అమలు అసహానం వ్యక్తం చేసినా వారిలో ఎటువంటి మార్పు రావడం లేదన్నారు. ప్రశ్నించే గొంతుకలను అలచివేయాలని చూడడం, ప్రజాస్వామ్య గొంతు నొక్కడమేనన్నారు. హైదరాబాద్ నూనవ హక్కుల కమీషన్‌కు వచ్చిన అడ్వకేటను మల్టీలో పోలీసులు తీసుకెళ్లాడం దుర్భరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఖమ్మం జిల్లాలో మైనర్ బాలికపై ప్రజాప్రతినిధి అత్యాచారం చేస్తే పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం హేయమైన చర్య అన్నారు. ప్రతిపక్ష నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించడం సిగ్గుచేటు చర్యగా ఆయన అభివర్ణించారు. బిసి కమీషన్‌ను కూడా పక్కవారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్లో కొనసాగుతున్న మంత్రులకు చెందిన భూములకు ఎలా రెగ్యులరైజ్ చేస్తున్నారని. ప్రశ్నించారు. భవిష్యత్తులో ఆ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజలు గుణపాళం చెప్పే బిజెపిని గెలిపించడం ఖాయమని తెలిపారు. ఈ సమావేశంలో బిజెపీ రాష్ట్ర, జిల్లా నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ,గట్టా సత్యనారాయణ, గెంటెల విద్యాసాగర్ రుద్రప్రదీప్, దేవకి వాసుదేవరావు పాల్గొన్నారు.