Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వి. పి గౌతమ్
నవతెలంగాణ-రఘునాధపాలెం
పరిశుభ్రత ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పరుచుకుని డ్రై డే కార్యక్రమాలు ముమ్మరంగా జరగాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతం పేర్కొన్నారు. మంగళవారం మండలంలో కలెక్టర్ పర్యటించి డ్రై డే కార్యక్రమాలను తనిఖీ చేశారు. ఇంటింటికి తిరిగి పరిశుభ్రత పనులను కలెక్టర్ తనిఖీ చేసి నిర్వాసితులను అవగాహన కల్పించారు. ఇంటితో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి ముందు మురుగు కాలువలలో చెత్తా చెదారం వేయరాదని, తద్వారా దోమలు వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, కలెక్టర్ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో కోవిడ్ పాజిటివ్ నుండి కోలుకున్న వారి ఇండ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మాస్కు ధరించని వారిపై 1000/- రూపాయలు జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బుడిదంపాడు గ్రామపంచాయతీ నర్సరీని పరిశీలించి తదుపరి అనంతరం రఘునాధపాలెం కోయ చిలక బైపాస్ యాపిల్ రోడ్డు కూడలిలో ఏవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, మాలతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, విద్య చందన, డి ఎం ఓ ఉష శ్రీ, తహసీల్దారు జి నరసింహారావు, రఘునాధపాలెం గ్రామ సర్పంచ్, లు, ఎస్.కె మీరా సాహెబ్, గుడిపూడి శారద, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రసన్న కుమార్, తదితరులు పాల్గొన్నారు.