Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధికి ఆటంకం
నవతెలంగాణ-అశ్వారావుపేట
అధికారుల నిర్లక్ష్యమో, అధినేతల పక్షపాతంతో తెలియదు కానీ ఆ గ్రామ పంచాయతీ ప్రజలు మాత్రం వారికి రావాల్సినంత తలసరి చెల్లింపులు రాక అభివృద్ధికి నోచుకోక ఆ గిరిజనులు బేలచూపులు చూస్తున్నారు.
మండల పరిధిలోని ఆసుపాక పంచాయతీ కార్యాలయం ప్రస్తుత నివేదిక ప్రకారం మొత్తం గృహాలు 675, మొత్తం కుటుంబాలు (రేషన్ కార్డులు) 743, మొత్తం ఓటర్లు 1800, మొత్తం జనాభా 3500. 2015 పంచాయతీల పునర్వి భజనలో భాగంగా ఆసుపాక పంచాయతీలో అంత ర్భాగంగా ఉన్న వినాయకపురంను నూతన పంచా యతీగా ఏర్పాటు చేసారు. ఎపుడైనా, ఎక్కడైనా నాభా ప్రాతిపదికన పంచాయతీలను విభజిస్తారు. కానీ విచిత్రం ఏమిటంటే ఉమ్మడి పంచాయతీగా ఉన్న ఆసుపాక మాత్రం ఓటింగ్ ఆధారంగా విభజించారు. అప్పటి పంచాయతీ అధికారులు. దీంతో జనాభా లెక్క ల ప్రకారం 3500 మందికి రావాల్సిన 15వ ఆర్ధిక సంఘం తలసరి చెల్లింపులు( నిధులు) ఈ పంచా యతీకి మాత్రం ఓటింగ్ ఆధారంగా 1800 మందికే చెల్లిస్తున్నారు. ప్రతీ నెల రాష్ట్ర వాటా రూ.100లు, కేంద్రం వాటా రూ.27లు సుమారుగా తలసరి చెల్లిం పులు చెల్లించాలి. ఈ లెక్కన జనాభాకు తగ్గా నిధులు రాకపోవడం అభివృద్ధికి ఆటంకంగా మారిందని సర్పంచ్ కొనుసోతు లింగయ్య వాపోతున్నారు.