Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ సాగనంపి దేశాన్ని రక్షించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అన్నారు. మండలంలోని ముత్తగూడెం,గుర్రాలపాడు గ్రామలల్లో బుధవారం 21వ గ్రామశాఖ మహాసభలు ఘనంగా నిర్వహించారు.ఈ మహాసభల్లో యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళనలు,పోరాటాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ముత్తగూడెం శాఖ కార్యదర్శిగా చామకురి రవీందర్, సహాయ కార్యదర్శిగా తాటి వెంకటేశ్వర్లు,గుర్రాలపాడు శాఖ కార్యదర్శిగా బుర్ర వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమలలో సిపిఎం మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్,మండల కార్యదర్శి వర్గ సభ్యులు పెరుమలపల్లి మోహన్ రావు,బందెల వెంకయ్య,పొన్నెకంటి సంగయ్య,కార్పొరేషన్ మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్ రెడ్డి,మండల నాయకులు పసుపులేటి సత్య నారాయణ, మేడికొండ నాగేశ్వరరావు,తోట పెద్ద వెంకట రెడ్డి,దొడ్డ వెంకటప్పయ్య,డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి శీలం వీరబాబు,ముత్త గూడెం ఉపసర్పంచ్ పున్నం సంగయ్య,దనియకుల రామయ్య,వడ్లమూడి నాగేశ్వరరావు,దొడ్డ వెంకన్న,కోర్ని వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.