Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
మధిర మండలంలోని పలు గ్రామాలు బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని వంగవీడు గ్రామంలోని నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా హరితహారం కార్యక్రమంలో పలు మొక్కలు నాటారు. అనంతరం జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ.. వంగవీడు గ్రామం అభివద్ధి కోసం తమ వంతు కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఎంపీపీ లలిత, సర్పంచ్ బొగ్గుల పద్మావతివీరారెడ్డి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వర రావు,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.