Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ను బుధవారం సంజీవ రెడ్డి భవన్ లో కలిసి జిల్లా మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పరిమి అనంతలక్ష్మీ తన రాజీనామా పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ముందు వరకు పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవిని ఇస్తారని చెప్పి ఇప్పుడు వేరొకరిని అధ్యక్షురాలును చేయడం బాధేసిందన్నారు. తన రాజకీయ భవిష్యత్ గురించి త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు.