Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఎమ్మెల్యేగా గెలిచిన గుర్తు గుర్తుందా ?
- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం
నవతెలంగాణ-మణుగూరు, పినపాక
ఇంద్రవెల్లి దళిత దండోరా సభను చూసి టీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుందని, దాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించే అధికారం కాంతారావు లేదని మణుగూరు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పిరినాకి నవీన్, పినపాక మండల అధ్యక్షుడు గోడిశాల రామనాధం అన్నారు. బుధవారం ఆయా పార్టీ కార్యాలయాల్లో వారు విలేకర్లతో మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. నియోజకవర్గం శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర విఫ్ రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను ఉద్దేశించి కెసిఆర్ మెప్పు పొందటం కోసం ఒక్క గిరిజన బిడ్డ అయుండి దళిత గిరిజనులను అవహేళన చేసేలా మాట్లాడటం చూస్తుంటే నిజంగా కాంతారావు కాంతారావువేనా అనిపిస్తుందన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోతే మీరు ఎక్కడుండేవారు చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి చేతికున్న సిరా చుక్క ఆరాక ముందే తెరాస పార్టీకి అమ్ముడు పోయారని కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి, మిమ్మల్ని నమ్మి గెలిపించిన కార్యకర్తలను మోసం చేశారన్నారు. రేవంత్ రెడ్డిని అనే ముందు ను గురిగింజవన్న సంగతి మర్చిపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నాయకులు బోడ రమేష్, కొంభంత్తిని శ్రీనివాస్, గీదా సాయి, కొమరం వెంకటేశ్వర్లు, జాడి రాంబాబు, జక్కా వెంకటేష్, మధార్, వరప్రసాద్, పూనేం వెంకటేష్, మునిగేలా వెంకటేశ్వర్లు, పొనుగోటి పూర్ణచందారావు, మణుగూరులో జరిగిన సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండి.రశీద్, ఎన్ఎస్యుఐ నాయకులు షేక్ ఆరీఫ్పాషా, ముక్కెర లక్ష్మణ్, పాల్గొన్నారు.