Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 117 మంది విద్యార్థులు హాజరు
నవతెలంగాణ - అశ్వారావుపేట
నవోదయ ప్రవేశ అర్హత కోసం నిర్వహించే పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి.స్థానిక జిల్లా పరిషత్ బాల, బాలికల పాఠశాలల్లో రెండు సెంటర్లలో పరీక్షలు జరగగా మొత్తం 211 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 117 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. పరీక్షకు ముందు హాజరైన విద్యార్థులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వారికి టెంపరేచర్ పరీక్షలను వైద్య సిబ్బంది నిర్వహించారు. ఉదయం 11.30 నిమిషాలకు ప్రారంభమైన పరీక్ష రెండున్నర గంటలపాటు జరిగింది. ఈ పరీక్షలను డిస్ట్రిక్ లెవల్ అబ్జర్వర్ నాగముత్యం, సెంటర్ లెవల్ అబ్జర్వర్ టీవి నర్సింహరావు, ఉమాదేవి, బ్లాక్వల్ అబ్జర్వర్ స్థానిక ఎం.ఈ.ఓ పీ క్రిష్ణయ్య, కె.లక్ష్మీలు, చీప్ సూపర్నెండెంట్లుగా పత్తేపరపు రాంబాబు, అమృతకుమారిలు పరీక్ష నిర్వహణ అధికారులుగా వ్యవహరించారు.