Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
- సీపీఐ(ఎం) సంఘీభావం
నవతెలంగాణ-కొత్తగూడెం
పోడు భూములకు పట్టాలివ్వాలని, కేంద్రంలో బీజేపి ప్రభుత్వం తీసుకు వచ్చిన 3 నల్ల చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోడు భూముల పోరుగర్జన పాదయాత్ర 9న, కొమారారంలో ప్రారంభమై, ఇల్లెందు, టేకులపల్లి, మీదుగా మూడు రోజులుగా, కాలినడకన ఆదివాసి పాదయాత్ర బుధవారం కలెక్టరేట్ వద్ద ముగిసింది. ముగింపు ధర్నా సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కొక్కు సారంగపాణి అధ్యక్షతన జరిగిన కలెక్టరేట్, వద్ద భారీ సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట నాయకులు పరకాల నాగన్న పాల్గొని మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులకు ఆడవే జీవనం, జీవితం, వారి జీవి తమంతా అడవిలో పెనవే సుకుని ఉన్న నాగరికతనే ఆదివాసీల చరిత్రని ఉద్ఘా టించారు. సాగు దారులపై, అక్రమ కేసులను, ఉపసంహరించుకోవాలని, ఓపెన్ కాస్ట్ బావులను కార్పొరేట్ కు ధారాదత్తం చేసే, పర్యావరణాన్ని నాశనం చేసే బావులను వ్యతిరేకించండి, అండర్ గ్రౌండ్ బావులను తీసి, కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రకు, కలెక్టరేట్ వద్ద జరిగిన సభకు భద్రాద్రి కొత్తగూడెం సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె. షాబీర్పాష, కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగ సీతారాములు, బాలశౌరి, శేఖర్, ఏఐకెఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు మండల వెంకన్న, గుండాల ఎంపీపీ, పార్టీ జిల్లా నాయకులు మూక్తీ సత్యం, గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్క, తుపాకుల నాగేశ్వరరావు, ఎస్కె ఉమర్, ప్రకాష్, కోరం సీతారాములు, నరేష్, పర్శక రవి, బట్టు ప్రసాద్, ఎన్డి కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కందగట్ల సురేందర్, మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోరి రవి, జక్కుల రాంబాబు, జూలూరుపాడు సంయుక్త మండల కార్యదర్శి వై గోపాల్ రావు, జిల్లా అధ్యక్షులు కాంపాటీ పథ్వి, కోలా లక్ష్మీనారాయణ, చింత నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.