Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు చిరునోముల కలెక్టర్ రాక
నవతెలంగాణ- బోనకల్
ఓ కలెక్టర్ సాబ్ మీరు గురువారం నా మీద నుంచి మీరు చిరునోముల వెళ్తున్నారట. నేను కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నేను ఏ సమయంలో కూలి పోతానో, ఎంత మంది ప్రాణాలు తీస్తానో నాకే తెలియదు. మీరు వస్తున్నారని నాకు తెలిసింది. మీరు అయినా నా గురించి పట్టించుకోండి. మీరు కూడా అందరిలాగే గురువారం నా మీద నుంచి వెళ్ళిపోతే ఆ తర్వాత మీ ఇష్టం. నేను కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను 40 ఏళ్ల క్రితం సాగర కాలువపై నిర్మించారు. నేను శిథిలావస్థకు చేరుకున్నాను. అనేకమంది జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు నన్ను చూసుకుంటూనే నా మీద నుంచి వెళ్ళిపోతున్నారు. నా గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. నేను ప్రాణాలు తీస్తేనే నా గురించి పట్టించుకుంటారా? లేకపోతే పట్టించుకోరా? మొట్టమొదటగా మీరు నా మీద నుంచి వెళుతున్నారు. మీరైనా వెంటనే నా గురించి పట్టించుకోకపోతే ఎప్పుడు ఏ సమయంలో ఎంత మంది ప్రాణాలు తీస్తానో నాకే తెలియదు ఇక మీ ఇష్టం. ఇప్పటికే మధ్య భాగంలో కిందకు కుంగిపోయి ఉన్నాను. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు.