Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా టౌన్
ఇంజనీరింగ్ చివరి సంవత్సరం పరిక్షా ఫలితాలలో సి.ఎస్.ఇ విభాగంలో ఖమ్మం జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించిన వైరా మండలం వల్లాపురం గ్రామంకు చెందిన సిపిఐ (ఎం) వైరా మండల నాయకులు బాజోజి రమణ, పద్మావతి దంపతుల కుమార్తె బాజోజి శ్రావ్యను తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, సిపిఐ(ఎం) వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో మరింతగా చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించి జన్మనిచ్చిన తల్లితండ్రులకు, పుట్టిన గ్రామానికీ, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.