Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జేవిఎల్.శిరీష
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన టెలిమెడిసిన్ ద్వారా జిల్లా ప్రజలకు ఆధునిక చికిత్సలు అందించుటకు టెలి కన్సల్టెన్సీను ఏర్పాటుచేసినట్లు దీని ద్వారా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య అందుబాటులోకి వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జేవిఎల్. శిరీష తెలిపారు. జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ,భద్రాచలం అసుపత్రులతో కలిపి 34 యూబిడబ్ల్యూ గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కోత్తగూడెం హబ్ కింద 15 స్టాక్ పాయింట్లు ఇవ్వడం జరిగిందనితెలిపారు. గుండాల, కొమురారం, ఆళ్లపల్లి, రొంపెడు,, చండ్రుగొండ, ఎర్రగుంట, జూలూరుపాడు, సుజాతనగర్, ఎంపి బంజర ప్రాధమికారోగ్య కేంద్రాలు ఉన్నాయని, పాల్వంచ హబ్లో 8 స్టాక్ పాయింట్లు జగన్నాధపురం, ఉల్వనూరు, గుడిపాడు, మంగపేట, పట్వారిగూడెం, గుమ్మడివల్లి,వినాయకపురం, దమ్మపేట ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయని, భద్రాచలంలో 11 స్టాక్ పాయింట్ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చర్ల, ఆశ్వాపురం, మణుగూరు, పినపాక, జానంపేట, బంజర, కరకగూడెం ఉన్నాయని తెలిపారు. మొత్తం జిల్లాలోని 29 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు కలిపి 34 కేంద్రాలలో అడ్మినిస్ట్రేటివ్ మ్యూపింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా కేంద్రాల్లో ప్రజలకువారికి అవసరమైన చికిత్సకు ఈ టెలికన్సల్టెన్సీ ద్వారా మాట్లాడి సలహాలు, సూచనలతో పాటు చికిత్సను పొంద వచ్చని తెలిపారు. సోమవారం గైనకాలజీ, చర్మవాధుల కోసం, మంగళవారం చెవి, ముక్కు,గొంతు, ఆప్తమాలజీ, బుధవారం జనరల్ మెడిసిన్, గురువారం చిన్నపిల్ల స్పెషలిస్టు, శస్త్రచికిత్సల నిపుణులు, శుక్రవారం గైనకాలజిస్టు, శనివారం ఆర్థోపెడిక్ వైద్యనిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు.