Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య
నవతెలంగాణ-పాల్వంచ రూరల్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం పాల్వంచ మండల పరిధిలోని పునుకుల గ్రామ పంచాయతీలో సిపిఐ(ఎం) శాఖ మహాసభ మామిడి గురవయ్య అధ్యక్షతన నిర్వహించారు. మహాసభ ప్రారంభ సూచికగా గ్రామ ఉప సర్పంచ్ పార్టీ మండల కమిటీ సభ్యులు గడ్డమీద నాగార్జున పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కాసాని ఐలయ్య మాట్లాడుతూ భారతదేశంలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదని 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ధనవంతులకు కొమ్ము కాస్తూ పేదలకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తుందని తీవ్రస్థాయిలో విమర్శించారు. జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. ప్రజల హక్కుగా ఉన్న విద్యుత్తును ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని దీనివలన సామాన్యులకు పేద ప్రజలకు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్లాంటి దుర్మార్గమైన బిల్లులను సిపిఐ (ఎం )పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
పునుకుల గ్రామాన్ని కేటీపీఎస్ యాజమాన్యం దత్తత తీసుకుందని కానీ అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వము కేటీపీఎస్ యాజమాన్యం స్పందించి కేటీపీఎస్ ద్వారా విడుదలయ్యే సిఎస్ఆర్ నిధులను గ్రామపంచాయతీలగ్రామపంచాయతీకి కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పునుకుల గ్రామపంచాయతీలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంచాలని ఈ విషయంలో స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకోవాలని లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమిస్తారు అని హెచ్చరించారు.