Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటంకంగా మారిన నిరసనలు
నవతెలంగాణ - అశ్వారావుపేట
బృహత్ పట్టణ ప్రకృతి వెనుక మండల కేంద్రమైన అశ్వారావుపేటలో స్థానిక మేజర్ పంచాయతీ పరిధిలో రెవెన్యూ అధికారులు బృహత్ పట్టణ ప్రకృతి వనంకు కేటాయించిన భూమిలో స్థానిక అధికారు పనులు నిర్వహిస్తుండగా బుధవారం కొందరు మహిళలు మా భూమి అంటూ పనులను అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం బృహత్ పల్లె పట్టణ ప్రకృతి వనాల పేరుతో చిట్టడవులను పెంచేందుకు ఒక బృహత్తర కార్యక్రమంను చేపట్టింది. అందులో భాగంగానే ప్రతీ మండల కేంద్రంలో ఓ బృహత్ పట్టణ ప్రకృతి వనం నిర్మించతలపెట్టారు.ఈ క్రమంలో మేజర్ పంచాయతీలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు భూమిని కేటాయించాలని రెవిన్యూ అధికారులకు ఉన్నతాధికారులు సూచించగా వ్యవసాయ కళాశాల వెనుక బాగంలో సర్వేనెంబర్ 104లో 8 ఎకరాలను పంచాయతీకి అప్పగించారు. వెనువెంటనే పంచాయతీ సిబ్బంది గత మూడురోజులు నుండి బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు నిర్వహిస్తున్నారు.ఈ నేపద్యంలో సదరు భూమి మాదంటూ గత 25 ఏళ్ళుగా మా ఆదీనంలో మేమే సాగు చేసుకుంటున్నామని కొందరు మహిళలు వచ్చి పనులను అడ్డుకున్నారు. దుక్కి చేసే ట్రాక్టర్ అడ్డంగా నిలబడి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎంపిఓ సీతారామరాజు, ఈవో గజవెల్లి హరికృష్ణ, సర్పంచ్ రమ్య, ఉపసర్పంచ్ రేమళ్ళ కేధార్ నాధ్లు అక్కడకు చేరుకుని అడ్డుకున్నవారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు సమేమిరా అనటంతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.