Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యా-ఉపాధి కల్పనకై కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు, నిరుద్యోగ భృతి చెల్లించాలని, తక్షణమే విద్యా సంస్థలను తెరిచి, ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరన కార్యాలయం ముందు ధర్నా నిర్వహంచారు. ముందుగా స్థానిక బస్టాండ్ సెంటర్లోని ప్రియదర్శిని కళాశాల నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్దఎత్తున నినాదాలతో నిరసన తెలిపారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు లిక్కి బాలరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు, నిరుద్యోగ భృతి చెల్లించాలని, తక్షణమే విద్యా సంస్థలను తెరిచి, ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలని కోరారు. అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా వ్యాక్సిన్ అందించాలన్నారు. ప్రభుత్వ విద్యను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించేందుకు తమరు ప్రత్యేక శ్రద్ధ చూపాలని లేనిపక్షంలో యువజన,విద్యార్థి సంఘాలు భవిష్యత్తులో పోరాటాలను ఉదృతం చేస్తామని ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఉప్పెర్ల ప్రశాంత్, వేల్పుల వీరబాబు, చల్లా అశోక్, పగడాల అనిల్, రాగాల ఆనంద్ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు నవీన్ కొట్టే, అభిమిత్ర, కడుదుల కిషోర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.