Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు
- భాష మార్చకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడతారు
- టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ ఆగ్రహం
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఎడవల్లి కృష్ణ అన్నారు. రేవంత్ రెడ్డిపై టీిఆర్‌ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై ప్రతిపక్ష నాయకులపై అసభ్య పదజాలాన్ని మొట్టమొదటి అలవాటు చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆరోపించారు. కుక్కలతో ఐపీఎస్ అధికారుల తో కాళ్ళు మొక్కి చుకోవడం వంటి కెసిఆర్‌కు అలవాటేనని అన్నారు. ఇతర పార్టీ నాయకులు అందరూ సన్నాసులు దద్దమ్మలు అసభ్య పదజాలంతో ప్రజలను ప్రజాప్రతినిధులను గౌరవం ఇవ్వకుండా అసభ్యంగా మాట్లాడే విధానం దానికి కర్త స్ఫూర్తి కెసిఆర్ అని అన్నారు. ఇతరులను అనేముందు టిఆర్ఎస్ నాయకులు వారి అధ్యక్షులు మాట్లాడే భాషను మార్చు కోవాలని చెప్పారు. ఇంకోసారి రేవంత్ రెడ్డి పై ప్రజా ప్రతినిధులపై కెసిఆర్, టీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్తులో వారి భాష తీరు మారకపోతే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తిరగబడతారని హెచ్చరించారు.