Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పునరావాస కేంద్రాన్ని ఎత్తివేస్తే నిర్వాసితులు ఎక్కడ తలదాచుకోవాలి
- గూడు కల్పించే వరకూ ప్రభుత్వ స్థలాల్లో డేరాలు ఏర్పాటు చేసుకుంటే తప్పేంటి
నవతతెలంగాణ-కొత్తగూడెం
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వ ఇచ్చిన హామీ అమలయ్యేవరకు తల దాచుకునేందుకు. ప్రభుత్వ స్థలంలో డేరాలు, గుడిసెలు ఏర్పాటు చేసుకునేందుకు సిద్దమైన మేదరి బస్తి, తుమ్మలనగర్ రైల్వే నిర్వాసితులను, వారికి అండగా నిలబడిన సీపీఐ(ఎం). సీపీఐ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి నిర్భందించడం అమాను షమని, పేదల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైందికదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు.
గురువారం లక్ష్మి దేవిపల్లి మండల పోలీస్ స్టేషన్లో నిర్భందంలో ఉన్న నిర్వాసితులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారుల వైఫల్యం, నిర్లక్ష్యం వల్లే రైల్వే శాఖ అత్యుత్సాహం ప్రదర్శించి పేదలను రోడ్డుపాలు అయ్యరని మండి పడ్డారు. గూడు కోల్పోయిన పేదలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు కొద్ది రోజుల్లోనే పునరావాస కేంద్ర నిర్వహణ భాద్యతలనుంచి తప్పుకొని పేదలకు కన్నీరు పెట్టిస్తున్నారన్నారు. రోడ్డున పడిన పరిస్థితిలో తాత్కాలిక నివాసాల ఏర్పాటుకోసం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే ప్రయత్నం చేశారని, యుద్ద ప్రాతిపదికన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీ అమలయ్యే వరకు ప్రభుత్వ స్థలాల్లో నివాసముం డేందుకు భేషరతుగా అనుమతి ఇవ్వాలన్నారు.
సీపీఐ(ఎం) సంఘీభావం....బాధితులకు పరామర్శ
కొత్తగూడెం రైల్వే నిర్వాసితులకు డబల్ బెడ్రూమ్ ఇళు కట్టించే వరకు ఈ పోరాటం ఆగదుని సీపీఐ(ఎం) నేతలు స్పష్టం చేశారు. కొత్తగూడెం రామచంద్ర కాలేజీ వెనకాల ప్రభుత్వ స్థలాలను నిర్వాసితులు ఆక్రమణకు లక్ష్మీదేవి పల్లి పోలీసులు నిర్వాసితులను అరెస్టు చేయడం జరిగింది. వారికి అండగా వామపక్ష పార్టీల నేతలు వెళ్లి వారిని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని తెలిపారు. స్థానిక తహసిల్దార్ని పిలిపించి 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు జాటోతు కృష్ణ, బాలరాజు, సీపిఐ నాయకులు మాచర్ల శ్రీనివాస్, కె.రత్నకుమారి, ఏఐటియుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, మున్సిపల్ సిపిఐ పక్ష నాయకులు వై.శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగ సీతారాములు, జెబి.శౌరి, వార్డు కౌన్సిలర్ పి.సత్యనారా యణచారి, సిపిఐ నాయకులు ధనుంజరు, పాషా తదితరులు పోలీస్ స్టేషన్ను సందర్శించి నేతలను, భూ నిర్వాసితులను పరామర్శించి భూ పోరాటానికి సంఘీబావం తెలిపారు.