Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందించిన కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు జిల్లా గ్రీన్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ గురువారం కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. రాష్ట్ర నోడల్ అధికారి ఝాన్సీ అధ్యక్షతన నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఈ అవార్డును కలెక్టర్ చేతుల మీదుగా కళాశాల డైరెక్టర్ శ్రీరామనేని చలపతి రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్కె. నయూమ్లు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఇతర కళాశాలలు ప్రియదర్శని కళాశాలను ఆదర్శంగా తీసుకొని స్వచ్చ నిర్మాణంలో ముందుకు సాగాలని సూచించారు. మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కమిటీ ద్వారా ప్రియదర్శిని కళాశాలకు జిల్లా గ్రీన్ అవార్డు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ ఝాన్సీ, ఎన్ఎస్ఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.