Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేంసూరు
మండల సర్వసభ్య సమావేశానికి సగంమంది ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు. ప్రజా ప్రతినిధులు అడిగే సమాధానాలకు అధికారులు చెప్పే సమాధానాలకు పొంతన లేదు. మర్లపాడు సెంటర్లో నూతనంగా నిర్మించిన డ్రైనేజ్ కూలిపోయిన సంఘటన గురించి స్థానిక ఎంపీటీసీ రాఘవరెడ్డి సంబంధిత అధికారులను నిలదీశారు. వేంసూర్ సొసైటీ అధ్యక్షుడు తక్కెళ్ళపాడు గోపాలకృష్ణ రెవిన్యూ అధికారుల పనితీరుపై విరుచుకుపడ్డారు. పట్టా భూములను ప్రభుత్వ భూములుగా మార్చిన అధికారుల తీరుపై సమాధానం చెప్పాలని డిప్యూటీ తాసిల్దార్ ఎర్రయ్యను ప్రశ్నించారు. మండలంలో 46 వేల మంది జనాభా ఉండగా ఇప్పటివరకు ఆరు వేల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయడం జరిగిందని, మిగిలిన వారికి వేయాలంటే సంవత్సరాలు పడుతుందని, వ్యాక్సినేషన్‌ను పెంచాలని వైద్యాధికారులను కోరారు. మండలంలో ఎంపీటీసీలు, సర్పంచుల మధ్య వార్ కొనసాగుతోంది. దీంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రతి చిన్న విషయానికి ప్రోటోకాల్ రగడ కొనసాగుతూనే ఉంది. ఈ విషయాన్ని కొంతమంది ఎంపీటీసీలు ఈ సమావేశంలో చర్చించారు. ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీటీసీ రాఘవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు అదేవిధంగా బిసి బంధు అమలు చేయాలని సమావేశంలో తీర్మానం చేయాలని కోరడంతో ఒక్కసారిగా సభ్యులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, ఎంపీడీవో వీరేశంతో పాటు వివిధ శాఖల అధికారులు సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు.