Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజ కవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా చోటుచేసు కుంటున్నాయి. ఇటీవల మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ దానికి నాంది పలికారు. వెనువెంటనే భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన అనంతరం నుంచి కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం పెరిగింది. దీంతో టీఆర్ఎస్లో భయాందోళన చోటు చేసుకుంది. గత ఎన్నికల అనంతరం నియోజవర్గంలో ఏకఛత్రాధిపత్యంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అతని తనయుడు వనమా రాఘవేంద్ర రావు మకుటంలేని మహారాజుగా చెలామణి అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ శ్రేణుల్లో కదలిక రావడం అదే సమయంలో ఎమ్మెల్యే తనయుడు రాఘవేంద్రరావు వడ్డీ వ్యాపారి ఆత్మహత్య ప్రేరణ కేసు నమోదు కావడం తీవ్ర ఆందోళన చోటు చేసుకుంది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవేంద్రరావు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా వారికి నో ఎంట్రీ సమాధానం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదే వాస్తవమైతే తనయుడు చేసిన తప్పిదాలపై ఎమ్మెల్యేపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా తండ్రీకొడుకులు ఇద్దరు నియోజకవర్గాన్ని వీడి ఉండటం అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ప్రయత్నం చేయడం అధిష్టానానికి మింగుడు పడడం లేదు.
మూడు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే ఆయన తనయుడిపై అధిష్టానానికి అనేక భూదందాలు సెటిల్మెంట్లు ఫిర్యాదులు వెళ్లడం తాజాగా ఆత్మహత్య ప్రేరేపణ కేసు నమోదు కావడంతో అధిష్టానం పునరాలో చనలో పడింది. అందుకు అనుగుణంగా మాజీ శాసనస భ్యులు జలగం వెంకట్రావుకు తెరాస నియోజకవర్గం బాధ్యతలు అప్పగించే ప్రయత్నంలో పావులు కదుపుతోంది. పరాజయం పాలైన తర్వాత నియోజకవర్గం వైపు తిరిగి చూడని జలగం గురువారం ఏకంగా కొత్తగూడెం చేరుకొని తన అనుయాయులతో సమావేశం నిర్వహించారు. అదే క్రమంలో యువ నాయకుడు రాఘవేంద్రరావు జలగంకు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎవరు జలగం వైపు వెళ్లకుండా హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒకేరోజు ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాలు వేర్వేరు సమావేశం నిర్వహించడంతో పార్టీలో వర్గ పోరు తిరిగి ప్రారంభమైనట్లు తేటతెల్లమవుతున్నది.
అతి త్వరలో జలగం వెంకటరావు నియోజకవర్గ బాధ్యతలు ఇస్తారని ఎమ్మెల్సీ కూడా కట్టబెడతారని ప్రచారం జోరుగా సాగుతోంది. అదే వాస్తవమైతే గత మూడు సంవత్సరాలుగా ఎమ్మెల్యే అతని తనయుడు చేతిలో వేధింపులకు గురైన ప్రజలు అంతా జలగం వైపు మొగ్గు చూపే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఆ దిశగా పరిణామాలు చూస్తుంటే ఏమైనా జరగొచ్చని తెలుస్తుంది. ఇదే ఈ క్రమంలో కొత్తగూడెంలో రైల్వే భూములు స్వాధీనం చేసుకున్న ఈ క్రమంలో భూ నిర్వాసితులకు అండగా జలగం వెంకట్రావు నిలవడం తర్వాత వడ్డీ వ్యాపారి హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషుల ఎంతటివారైనా క్షమించే వద్దని డిమాండ్ చేయటం పరోక్షంగా వనమా రాఘవపైనే వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో గూడెంలో రాజకీయం వేడిక్కెంది.