Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధారాలుంటే చూపండి : రెవిన్యూ
- అడ్డగిస్తే కేసులు పెడతాం : పోలీస్
- ఎట్టకేలకు పనులు ప్రారంభం
నవతెలంగాణ-అశ్వారావుపేట
మండల కేంద్రమైన అశ్వారావుపేటలో ఇదే పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 104లో నిర్మించతలపెట్టిన బృహత్ పట్టణ ప్రకృతి వనం పనులను రెండో రోజు గురువారం పలువురు మహిళలు అడ్డుకున్నారు. బుధవారమే స్థానిక సర్పంచ్ అట్టం రమ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. గురువారం సైతం అడ్డగించడంతో ఎండించి విద్యాధర రావు పోలీసులకు సమాచారం అందించారు. ఈ చర్యతో స్పందించిన ఎస్ఐ చల్లా అరుణ బృహత్ పట్టణ ప్రకృతి వనం వద్ద తన సిబ్బందితో పహారా నిర్వహించారు. ఈ సందర్భంగా డోజర్, ట్రాక్టర్‌తో పనులు నిర్వహించేందుకు కేటాయించిన స్థలంలోకి వెళుతున్న వాహనాలను అడ్డుకున్న మహిళలు ఈ భూమి మాది, పనులు చేపట్టవద్దని డోజర్, ట్రాక్టర్ అడ్డంగా కూర్చున్నారు. అయితే మహిళలకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. రెవిన్యూ, ఫారెస్టు, పంచాయతీ, పోలీస్ శాఖ అధికారులు మహిళలకు ఎంత చెప్పినా వినకపోవటంతో పంచాయతీ మహిళా కార్మికుల సహాయంతో ఎస్ఐ అరుణ సున్నితంగా వారిని వ్యాన్ ఎక్కించి పనులకు అడ్డు తొలగించడంతో వారు కొద్ది సేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన వైస్ ఎంపీపీ ఫణీంద్ర సైతం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. కొంతసేపటికి వారంతటికి వారే అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఎస్సై చల్ల అరుణ, ఎంపీడీఓ విద్యాధరరావులు మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకుం ప్రభుత్వ పనులను అడ్డుకుంటే కేసులు పెట్టడం జరుగుతుందని సమస్య ఉంటే సంభందిత అధికారులను సంప్రదించాలని ఇలా అడ్డుకోవటం సరికాదని హెచ్చరించారు. ఎట్టకేలకు పనులు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.