Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు
నవతెలంగాణ-చర్ల
అభ్యాసికల ద్వారా గిరిజన విద్యార్థులకు విద్యా బోధన సులభతరం అవుతుందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు అన్నారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మండలంలోని దానవాయిపేట, కలివేరు గ్రామాలలో పర్యటించి గిరి దర్శిని అభ్యాసికల ద్వారా గిరిజన విద్యార్థులు నేర్చుకుంటున్న విద్యా నైపుణ్యా లను పీఓ స్వయంగా విద్యార్థుల ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలతో గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు విద్యా నైపుణ్యాలు మెరుగుపడి అన్ని తరగతులలో ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశ్యంతో భద్రాచలం, ఏటూరు నాగారం ఉట్నూరు, ఐటీడీలు గిరిజన సంక్షేమ ఉపాధ్యా యులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి గిరిజన విద్య పటిష్ట చేయడంలో భాగంగా 3 నుండి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని గిరి దర్శని అభ్యాసికలు తయారు చేయాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే గిరిజన ఉపాధ్యాయులతో మే నెలలో సమావేశాలు నిర్వహించి జూన్, జూలై మాసాలలో నిష్ణాతులైన 14 మంది గిరిజన ఉపాధ్యాయులతో పదవ తరగతికి సంబంధించిన గిరి దర్శని అబ్యాసిక భద్రాచలం ఐటీడీఏ ద్వారా రూపొందించి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు అందజేయడం జరిగిందని అన్నారు. పూర్తిస్థాయిలో పరిశీలించిన కమిషనర్ ముద్రించి భద్రాచలం ఐటీడీఏకి అందజేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఏటూరునాగారం ఐటీడీఏ నుండి 3 నుండి 8వ తరగతి వరకు సంబంధించిన విద్యా నైపుణ్యాల గిరి దర్శిని వారు తయారు చేశారని, ఉట్నూరు ఐటీడీఏ నుండి ఎనిమిదవ తరగతికి సంబంధించిన ఈ గిరి దర్శని అభ్యాసకులను గిరిజన విద్యార్థిని విద్యార్థులకు అందజేయడం జరిగిందని, వీటిలో ఉన్న విద్యా నైపుణ్యాలు నేర్చుకునే విధంగా ఉపాధ్యాయులతో విద్యార్థులకు అవగాహన చేస్తున్నామన్నారు. క్షేత్రస్థా యిలో పర్యటించి గిరి దర్శిని పుస్తకాలపై గిరిజన విద్యార్థుల సందేహాలను పీఓ నివృత్తి చేశారు. గిరి దర్శిని పాఠ్యాంశాలలో ఉన్న సందేహాలను ఉపాధ్యా యులు గిరిజన విద్యార్థులకు నివృత్తి చేయడానికి ప్రత్యేక చొరవ చూపాలని లేని ఎడల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పీఓ హెచ్చరించారు. గిరి దర్శిని అభ్యాసిక తయారు చేశారన్నారు.
ఈ క్షేత్ర స్థాయి పర్యటనలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమాదేవి, ఏటీడీఓ నరసింహా రావు సంబంధిత గిరిజన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.